Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ నుంచి ముంబైకి హైస్పీడ్ రైలు.. 3 గంటల్లోనే ప్రయాణం!

Dpr Ready For 761 Km Hyderabad Pune Mumbai High Speed Train Corridor
Advertisement
  • హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ డీపీఆర్ పూర్తి
  • గంటకు 330 కి.మీ. వేగంతో ప్రయాణం.. 3 గంటల్లోనే గమ్యం
  • వికారాబాద్ వద్ద 4.6 కిలోమీటర్ల భారీ టన్నెల్ నిర్మాణం
  • చెన్నై, బెంగళూరు కారిడార్లపైనా మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
Advertisement
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రయాణించే వారికి శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ - పుణె - ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పనులు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు వేగవంతం కానున్నాయని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాజాగా అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం మూడు గంటలలోపే చేరుకోవచ్చని మంత్రి తెలిపారు. గంటకు గరిష్ఠంగా 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైళ్లను డిజైన్ చేశారు. మొత్తం 761 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయని, అవసరాన్ని బట్టి ఎలివేటెడ్, అండర్‌గ్రౌండ్ మార్గాల్లో నిర్మాణం చేపడతామని వివరించారు. ముఖ్యంగా వికారాబాద్ సమీపంలో 4.6 కిలోమీటర్ల పొడవైన భారీ టన్నెల్ నిర్మించనుండటం ఈ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యమే కాదని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఎకనామిక్ గ్రోత్ కారిడార్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమీక్షలోనే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రతిపాదించిన ఇతర హైస్పీడ్ కారిడార్లపైనా మంత్రి చర్చించారు. అమరావతి మీదుగా వెళ్లే చెన్నై కారిడార్ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. అలాగే మన్ననూర్, సోమశిల మీదుగా వెళ్లే బెంగళూరు కారిడార్ అలైన్‌మెంట్ ప్లాన్‌లను కూడా పరిశీలించారు. ఈ భారీ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి కీలక విధాన నిర్ణయాలు తీసుకుంటామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేసి, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
Advertisement
Advertisement
High Speed Train
High Speed Train Corridor
Hyderabad-Mumbai

More Telugu News